logo
logo logo
fly

కనకదుర్గ

దేవాలయం ఫ్లైఓవర్ నిర్మాణం

ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఇదివరకు విజయవాడ శ్రీకనకదుర్గ దేవాలయం దగ్గర, దర్శనం కోసం వచ్చే భక్తుల విపరీతమైన రద్దీతో మరియు ఆ మార్గం ద్వారా ప్రయాణించే వివిధ వాహనాల రాకపోకలతో తరచూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తేవి. దాదాపు 20 నిమిషాలకొకటి చొప్పున దగ్గరి ప్రాంతాలనుండి గుడికి బస్సులు వస్తాయి. అలాగే 10 నిమిషాల ప్రయాణ వ్యవధి దూరంలో ఉన్న రైల్వే స్టేషన్ నుండి కూడా దేవాలయం వద్దకి నిరంతర రవాణా సదుపాయం ఉంది. ఇలాంటి పరిస్థితులతో ఇంద్రకీలాద్రి దగ్గర తరచూ ట్రాఫిక్ దిగ్భందం జరిగేది. జాతీయరహదారి పైన భవానిపురం దగ్గర రద్దీ వల్ల ట్రాఫిక్ స్థంబించిపోవడం సర్వసాధారణ విషయంగా ఉండేది. పండుగ రోజుల్లో మరియు ప్రజావేడుకల సమయాల్లో ట్రాఫిక్ రద్దీ ఉహించనలవికాదు. ఇలాంటి తీవ్రతర ప్రజాసమస్యకి శాశ్వత పరిష్కారం చూపే దిశలో విజయవాడ ఎం.పి. కేశినేని నాని గారు చొరవ తీసుకుని కనకదుర్గ దేవాలయం వెళ్ళే దారిలో ఫ్లైఓవర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయితే దూరప్రయాణాలు మరియు దగ్గరి ప్రయాణాలు చేసే మార్గాలను విభజిస్తూ వేర్వేరు మార్గాలకు రోడ్లు కలిపే సదుపాయం లభిస్తుంది. తద్వారా ఆ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీ తగ్గిపోయే అవకాశం ఉంది.

విజయవాడలో జన రవాణా మరియు ప్రయాణ సౌకర్యం మరింత మెరుగయ్యేలా, ఎం.పి. నాని గారు దృడ సంకల్పంతో కృషి చేసి కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రాజెక్ట్ కు మార్గం సుగమం చేశారు.

ఈ మొత్తం ప్రాజెక్ట్ కు సంబంధిత మంత్రిత్వశాఖల నుండి అనుమతులు రావడానికి దాదాపు సంవత్సరకాలం పట్టింది. నిరంతరం ఎం.పి. నాని గారు మరియు తన కార్యనిర్వాహక బృందం సంబంధిత శాఖాదికారుల్ని కలుస్తూ ఫ్లైఓవర్ ప్రాజెక్ట్ విజయవంతంగా ప్రారంభమయ్యేలా కృషి చేశారు. శ్రీయుత గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారి చేతులమీదుగా మొదటి శిల ప్రతిష్టింపజేసి, ప్రాజెక్ట్ కు శంఖుస్థాపన చేయడం జరిగింది. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయితే కనకదుర్గ దేవాలయం పరిసర ప్రాంతాల ద్వారా ప్రజలకి ప్రయాణం చాలా సులభతరం అయ్యే అవకాశం ఉంది. ఆయా మార్గాల్లో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. దీనివల్ల విజయవాడను స్వచ్ఛమైన మరియు ఆరోగ్యవంతమైన నగరంగా తీర్చిదిద్దే ఇతర కార్యక్రమాలు కూడా వేగవంతంగా పూర్తయ్యే అవకాశం ఉంది.

kesineni_nani
kesineni_nani
kesineni_nani

  కేశినేని భవన్, పిన్నలవారి వీధి, విజయవాడ పిన్ కోడ్: 520002, ఆంధ్రప్రదేశ్ .