logo
fly

కనకదుర్గ

దేవాలయం ఫ్లైఓవర్ నిర్మాణం

ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం : ఇదివరకు విజయవాడ శ్రీకనకదుర్గ దేవాలయం దగ్గర, దర్శనం కోసం వచ్చే భక్తుల విపరీతమైన రద్దీతో మరియు ఆ మార్గం ద్వారా ప్రయాణించే వివిధ వాహనాల రాకపోకలతో తరచూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తేవి. దాదాపు 20 నిమిషాలకొకటి చొప్పున దగ్గరి ప్రాంతాలనుండి గుడికి బస్సులు వస్తాయి. అలాగే 10 నిమిషాల ప్రయాణ వ్యవధి దూరంలో ఉన్న రైల్వే స్టేషన్ నుండి కూడా దేవాలయం వద్దకి నిరంతర రవాణా సదుపాయం ఉంది. ఇలాంటి పరిస్థితులతో ఇంద్రకీలాద్రి దగ్గర తరచూ ట్రాఫిక్ దిగ్భందం జరిగేది. జాతీయరహదారి పైన భవానిపురం దగ్గర రద్దీ వల్ల ట్రాఫిక్ స్థంబించిపోవడం సర్వసాధారణ విషయంగా ఉండేది. పండుగ రోజుల్లో మరియు ప్రజావేడుకల సమయాల్లో ట్రాఫిక్ రద్దీ ఉహించనలవికాదు.

"పూర్తి వివరాల కోసం..."
kesineni
kesineni

కేశినేని నాని

కేశినేని నాని గారు యావత్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే ఒక విభిన్న శైలిని కలిగిన ప్రజానాయకుడు. తన నియోజకవర్గ పరిధిలో ప్రజల జీవనశైలిలో గుణాత్మకమైన మార్పు తెచ్చేవిధంగా, సమగ్రమైన ప్రగతి ఫలాలు వారికి అందేవిధంగా నిరంతరం ఆలోచించే కార్యశీలి. తన ప్రాంత అభివృద్ధి కోసం, తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు మెరుగైన ఉపాది అవకాశాలు అందేలా ప్రణాళికలను రూపొందించడానికి నిరంతరం ఆసక్తి కనబరిచే నాయకుడు. నిజమైన నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే కేశినేని నాని గారు, “టాటాట్రస్ట్” యొక్క సౌజన్యంతో తన నియోజకం సమగ్రమైన ప్రగతి ఫలాలను పొందేలా కృషిచేస్తూ ఒక చరిత్రని సృష్టించారు. వారి సహకారంతో ఎన్నో విభిన్న పథకాలు, ఇదివరకెన్నడు చూడని విధంగా, విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని ప్రజల అభివృద్దికోసం శ్రీకారం చుట్టారు. తన స్ఫూర్తిదాయకమైన పర్యవేక్షణలో, వినూత్నమైన కార్యక్రమాలను రూపొందిస్తూ, “విజయవాడ” పట్టణాన్ని మెరుగైన ప్రజాజీవనానికి అనువైన, సౌకర్యవంతమైన మరియు ఆకర్షణీయమైన పట్టణంగా మార్చే దిశలో పయనిస్తున్నారు.

"పూర్తి వివరాల కోసం..."

  కేశినేని భవన్, పిన్నలవారి వీధి, విజయవాడ పిన్ కోడ్: 520002, ఆంధ్రప్రదేశ్ .